

Protest | కర్ణాటకలోని ఓ ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. క్లాస్ రూమ్‌లో ముస్లింగ్ విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కొందరు స్కార్ఫ్ కట్టుకొని నిరసన తెలిపారు. ఈ ఘటన కర్ణాటక కొప్పాలోని బాలాగడిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చోటుచేసుకుంది.
దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం మొదట ముస్లిం యువతులను హిజాబ్ ధరించి క్లాసులకు హాజరు కావద్దని కోరింది. అయితే తాజాగా తన నిర్ణయం మార్చుకుంటూ జనవరి 10 వరకు ప్రతి ఒక్కరు వారికి నచ్చింది ధరించ వచ్చని తెలిపింది.
ఇది కూడా చదవండి: Murder | డబ్బు పెట్టిన గొడవ.. ప్రాణం తీసిన స్నేహితుడు
అంతేకాకుండా ఈ నెల 10న టీచర్, పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నామని, ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు సైతం హాజరు అవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ఈ సమస్యను పరిష్కరిస్తామని, ఆ నిర్ణయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కాలేజీ ప్రిన్సిపాల్ అనంత్ మూర్తి తెలిపారు.
అయితే ఇటువంటి నిర్ణయమే మూడేళ్ల క్రితం తీసుకున్నామని, అది ఇప్పటివరకు సజావుగా పాటించబడిందని, కానీ ఇటీవల కొందరు ఒక్కసారిగా క్లాస్ రూమ్స్‌లోకి స్కార్ఫ్‌లు కట్టకొని వచ్చారని, ప్రశ్నిస్తే మరికొందరు విద్యార్థుల వస్త్రధారణను ఎత్తి చూపారని ఆయన చెప్పుకొచ్చారు.
#Students #MuslimGirls #Principal #Karnataka