

పూణె పోలీసులు జూదరాయుళ్ల ఆటకట్టించారు. పూణె కుందువా ఏరియాలోని బంగ్లాలో జూదం ఆడుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటికే జూదమాడుతూ తేలుతున్న జూదరాయుళ్లు పోలీసుల ఎంట్రీతో ఖంగుతిన్నారు. కొందరు అంతా అయిపోయిందని సరెండర్ కాగా కొందరు మాత్రం పారిపోయే ప్రయత్నం చేశారు
కానీ వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు రూ.58.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.8,04,407 విలువైన విదేశీ మారకంతో పాటు రూ.47,76,500 విలువైన దేశీ మారకం ఉంది. వాటితో పాటు దాదాపు రూ.1,42,500 విలువైన విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. వాటితో పాటు జూదగాళ్ల వాహనాలు, మొబైళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తామని, ఇక్కడ జూదం ఏర్పాటు చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని వారు తెలిపారు.
,