

MAA | మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా జరిగిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్‌ల మధ్య చిన్నపాటి యుద్దవాతావరణం నేలకొంది. కానీ చివరకు మంచు విష్ణు విజయకేతనం ఎగురవేశాడు.
మా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నాడు. అనంతరం ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆయనతో పాటు ఆయన ప్యానెల్‌లోని 11 మంది కూడా తమ రాజీనామా లేఖలను పంపారు.
ఈ తరుణంలో తాను ఈ రాజీనామాలను ఒప్పుకోవడం లేదని, ఆ లేఖలను వెనక్కి తీసుకొని ప్రతి ఒక్కరు ‘మా’ కుటుంబంలో సభ్యులుగా కొనసాగాలని కోరాడు. కానీ విష్ణు కోరికను ప్రకాష్ రాజ్ ప్యానెల్ పట్టించుకోలేదు.
ఈ విషయంపై తాజాగా విష్ణు మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. వారి రాజీనామాలను ఆమోదిస్తూ సంతకం చేశాడని, వారి స్థానాల్లో తన ప్యానెల్ వారిని తీసుకోనున్నారని సమాచారం.
అయితే ‘మా’లో ఎవరైనా తమ స్థానం నుంచి తప్పుకుంటే ఆ స్థానాన్ని భర్తీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు 11 మంది తమ పదవుల నుంచి తప్పుకోవడంతో వారి స్థానాల్లోకి కొత్త వారిని తీసుకునే అధికారం విష్ణుకు ఉంటుంది.
#Vishnu, #PrakashRaj, #MAA, #Resignation