

కొత్తగా పెళ్లైన జంట ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఒక రోజు వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుంది. దాన్ని గమనించి పొరుగింటి వారికి అనుమానం వచ్చింది. దాంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ ఇంటికి చేరుకున్నారు. తీరా ఇంటి తలుపులు తెరిచి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఇది గుజరాత్‌లో చోటుచేసుకుంది. దాంతో పోలీసులు దర్యాప్తు మరింత పటిష్టం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కానుభాయ్ అలియాస్ చాకో హితేష్‌భాయ్ గోహిల్ అనే యువకుడికి హన్స్‌బేన్ అనే యువతితో నాలుగు నెలల క్రితం అంటే ఈ ఏడాది జులైలో వివాహం జరిగింది.
ఇది కూడా చదవండి: Murder | దారుణానికి దారి తీసిన మద్యం.. పంపకాల్లో అవకతవక..
వారిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. కానుభాయ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ కొత్త జంట సనంద్‌లోని కాపుర్‌లో నివాసం ఉంటోంది. వీరిద్దరికి అన్యోన్యత కొద్ది రోజులకే పరిమితం అయ్యింది. ఇంతలో గొడవలు వారిద్దరి మధ్య చిచ్చు పెట్టాయి. వారిద్దరికీ తరచుగా గొడవలయ్యేవి. దాంతో కానుభాయ్ తన భార్యపై కోపం పెంచుకున్నాడు. దాంతో తన భార్యను హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.