

SBI | కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. మరెందరో ఉపాధి కోల్పోయారు. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా మంది నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఈ క్రమంలో డబ్బుకోసం చాలా మంది తప్పుడు మార్గాలను సైతం ఎంచుకుంటున్నారు. కొందరు తొంగతనాలు చేస్తుంటే, మరికొందరు దోపీడీలు చేస్తున్నారు.
ఇదే తరహాలో ముంబైలోని ఓ ఎస్‌బీఐ బ్యాంకులో కొందరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గన్నుతో బెదిరించి రూ.2.5 కాజేశారు. ఈ దోపీడిలో ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని దుండగులు హతమార్చారు. బ్యాంకులోని వారిని గన్నుతో ఒకరు బెదిరించగా, మరో వ్యక్తి డబ్బును సంచిలో వేసుకున్నాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం వారెవరన్నది తెలుసుకునేందకు ప్రయత్నిస్తున్నామని, వారికి గన్ను ఎవరు విక్రయించారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
https://twitter.com/MirrorNow/status/1476408061149384705?s=20
#SBI #Police #Robbery #GunFire