Hospital | హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం.. ప్రాణవాయువే..

Hospital | ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రత్యేకంగా ఉంచబడిన ముగ్గురు రోగులు అగ్నికి ఆహుతయ్యారు. వారి ప్రాణాలు

Spread the love
Hospital
Hospital

Hospital | ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రత్యేకంగా ఉంచబడిన ముగ్గురు రోగులు అగ్నికి ఆహుతయ్యారు. వారి ప్రాణాలు నిలబెట్టేందుకు పెట్టిన ప్రాణవాయువే వారి ప్రాణాలను హరించింది. ఈ సంఘటన ఉక్రెయిన్‌లో బుధవారం చోటుచేసుకుంది.

ఇటీవల కరోనాతో మరణించిన అతడికి నివాళులిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా మరణించిన వ్యక్తికి నివాళులిస్తూ స్టాఫ్ అంతా క్యాండిల్స్‌ను వెలిగించింది.

ఈ క్రమంలోనే ఒకరు ఐదు ఆక్సిజన్ కాంసన్‌ట్రేటర్ల వద్ద క్యాండిల్‌ను వెలిగించారు. దాంతో అవి వెంటనే అంటుకున్నాయి. అనంతరం భారీగా మంటలు వెదజల్లాయి.

అయితే ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు రోగులు మరణించగా, పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరికీ చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
#Hospital #FireAccident #Ukraine #Covid-19

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *