

Railway | రైల్వే గూడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని రైల్వే గూడౌన్స్‌లో చోటుచేసుకుంది. దీనిపై మథుర రైల్వే చీఫ్ ఫైర్ అధికారి ప్రమోద్ శర్మ స్పందించారు.
రైల్వే గైడౌన్స్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది 4 అగ్నిమాపక యంత్రాలతో దాదాపు 9 గంటల పాటు కష్టపడ్డారని ఆయన చెప్పారు.
ఈ ప్రమాదంలో లక్షల నష్టం జరిగిందని, ఇంకా పూర్తి నష్టం లెక్కకట్టాల్సి ఉందని ఆయన అన్నారు. మంటలు చెలరేగడానికి అసలు కారణం తెలుసుకునేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
#fire accident #railways godowns #investigation