
Refilling fuel view from inside of gas tank of a car

దొంగతనాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి. ప్రతి రోజు అనేక చోరీ కేసులు నమోదవుతుంటాయి. దాదాపు ప్రతి కేసులో విలువైన వస్తువులను దొంగలిస్తుంటారు. అయితే ఇటీవల యూఎస్‌లో ఓ భారీ చోరీ జరిగింది. అది కూడా మిలటరీ బేస్‌లో. ఇంకేం ఉంది.. గన్నులో, ఇతర ఆయుధాలో ఎత్తుకుపోయి ఉంటారని అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్లే. వారు ఒక్క గన్నుని కూడా ముట్టుకోలేదు. వాళ్లు కేవలం డీజిల్‌పైనే దృష్టి పెట్టారు. దాదాపు 2 వందల కోట్ల డాలర్లు విలువ చేసే డీజిల్‌ను దొంగలించారు. ఈ ఘటన రోమేనియాలోని యూఎస్ మిలటరీ బేస్‌లో జరిగింది. అయితే ప్రస్తుతం 7 గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కారణం లేకుండా చిన్న పిల్లాడిని చితకబాదిన ప్రిన్సిపాల్
ఈ సందర్భంగా రోమేనియా యాంటీ-మాఫియా సంస్థ డీఐఐసీఓటీ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన ఇంధనాన్ని కాజేయాలని 2017 నుంచి కొన్ని గ్రూప్‌లు ప్లాన్ చేస్తున్నాయి. ఇది వారి పనే. మిహైల్ కోగన్నిసియాను మిలటరీ బేస్‌తో పాటు ఇతర ప్రదేశాల్లోనూ ఇంధనం చోరీకి గురైంది. అనుమానం ఉన్న వారిని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే అనుమానితుల వివారాలు మాత్రం వెల్లడించలేదు.