Mobile | మొబైల్ దొంగతనం చేసిందని థర్డ్ డిగ్రీ..

Mobile | యూపీ అమేథీలో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికను కొందరు దారుణంగా కొట్టారు. ఆ బాలిక అరికాళ్ళపై కర్రలతో చితకబాదారు. మొబైల్..

Spread the love
Mobile
Mobile

Mobile | యూపీ అమేథీలో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికను కొందరు దారుణంగా కొట్టారు. ఆ బాలిక అరికాళ్ళపై కర్రలతో చితకబాదారు. మొబైల్ దొంగతనం చేసిందంటూ వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఒక వైపు అమ్మాయిని ఇంత దారుణంగా కొడుతుంటే దాన్ని వీడియోలు తీస్తున్నారు.

అంతేకాకుండా బాలికకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన పై అమేథీ సర్కిల్ పోలీసు అధికారి అర్పిత్ కపూర్ స్పందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ క్రమంలో బాలిక తండ్రిచేత కేసు నమోదు చేయించారు. అనంతరం విచారణ చేపట్టారు. సూరజ్ సోనీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం తమ ఇంట్లో మొబైల్ దొంగతనం జరిగిందని సూరజ్ సోనీ చెప్పాడు.

ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో ఒక యువకుడు మొబైల్ దొంగిలించడం కనిపించిందని, ఆ యువకుడిని పట్టుకుని విచారించామని అన్నాడు. విచారణలో బాలిక ఉన్నట్టు తేలిందని సూరజ్ సోని చెప్పారు.

ఆ దొంగతనం జరిగిన తర్వాత బాలిక చాలా రోజులుగా కనిపించకుండా పోవడంతో ఆమెను కొట్టామని సూరజ్ సోని తెలిపారు. అయితే మిగతా వారి కోసం గాలిస్తున్నామని, వారిపై పలు సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

#Minor #Police #UP

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *