

ఏడుగురు పూజారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహరాష్ట్ర నాసిక్‌లో చోటుచేసుకుంది. వీరిని బుధవారం బెయిల్‌పై విడుదల చేశారు. అయితే సాధారణంగా పూజారులంటే సహనానికి మారుపేరుగా, లోక కళ్యాణాన్ని కోరుకునే వారిగానే అందరికీ తెలుసు. నిరంతరం దేవుడి పూజలలో నిమగ్నమయి ఉంటారని అందరూ నమ్ముతారు.
అయితే నాసిక్‌లో మాత్రం ఏడుగురు పూజారులు చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతేకాకుండా వారిని జైలుపాలు కూడా చేసింది. మహరాష్ట్ర పోలీసులు వారిని ఆయుధాల చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజారుల కారులో లోకల్‌గా తయారైన పిస్టల్ ఒకటి, హాకీ బ్యాట్, కత్తి వంటి ఆయుధాలు లభించాయట. అంతేకాకుండా త్రయంబకేశ్వర్ శివాలయంలో జరగనున్న కొన్ని వేడుకల విషయంపై వారి మధ్య గొడవ జరుగుతుందని కూడా పోలీసులు చెప్పారు. అయితే వారిని బుధవారం బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలిపారు.