

Liquor | మద్యం మత్తుకు అలవాటు పడిన వారు అదొక్కటి ఉంటే చాలనుకుంటారు. మద్యం కోసం ఎంతదూరమైనా వెళతారు. కానీ బీహార్‌లో మాత్రం ఆ మందే వారి ప్రాణాలు హరించింది. మద్యం తాగడంతో ఐదుగురు మరణించారు.
ఈ ఘటన బీహార్ నలంద జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం.. వారిలో ముగ్గురు మాన్‌పూర్‌లో హూచ్ తాగడంతో మరణించారు. మరో ఇద్దరు ఛోటీ పహారీలో మరణించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. మద్యం కల్తీ చేయబడిందా? లేకుంటే చెడిపోయిందా? అని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
#Police #alcohol #bihar