Murder | 5 గంటల్లో రెండు హత్యలు.. మరొకరి కోసం పోలీసులు గాలింపు..

Murder | కేవలం 5 గంటల వ్యవధిలో రెండు హత్యలు చేశారు దుండగులు. ఇద్దరు టాక్సీ డ్రైవర్లను పొట్టనపెట్టుకున్నారు. కేసు నమోదు చేసి..

Spread the love
Murder Mystery
Murder

Murder | కేవలం 5 గంటల వ్యవధిలో రెండు హత్యలు చేశారు దుండగులు. ఇద్దరు టాక్సీ డ్రైవర్లను పొట్టనపెట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 7న ఆనంద్ పర్బత్, భరత్ నగర్ ప్రాంతాల్లో 5 గంటల వ్యవధిలోనే ఇద్దరు క్యాబ్ డ్రైవర్ల హత్య జరిగింది. ప్యాసింజర్‌లా క్యాబ్ ఎక్కిన నిందితులు కాసేపటికే డ్రైవర్‌ను హత్య చేసి అతడి సెల్ ఫోన్, నగదు తీసుకొని పరార్ అవుతున్నారని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Shocking | భార్యాభర్తల మధ్య గొడవ.. బావిలో దూకిన భర్త

ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందుతులను ఆకాష్, జునైద్‌గా పోలీసులు గుర్తించారు. మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

#Police, #Delhi, #Murders, #CabDriver

Spread the love

1 thought on “Murder | 5 గంటల్లో రెండు హత్యలు.. మరొకరి కోసం పోలీసులు గాలింపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *