

Vaccine | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం సృష్టిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పని సరిగా వేయించుకోవాలని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ప్రతిచోట కరనా వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్‌ను తస్సనిసరి చేసింది. దీనినే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.
కేవలం రూ.2 వేలకే వ్యాక్సిన్ సర్టిఫికేట్ అందిస్తున్నారు. ఈ సంఘటన ముంబైలో జరిగింది. దీనికి సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారు రూ.2 వేలకే సర్టిఫికేట్లు ఇస్తూ ప్రభుత్వ వెబ్ సైట్‌ను మోసం చేస్తున్నారని, వారి చర్యల కారణంగా ఎందరో అమాయక ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వారి విచారించామని తెలిపారు.
ప్రగతిఘడ్‌లో వ్యాక్సిన్ సెంటర్‌ను నడుపుతున్న ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ డాక్టర్‌తో కలిసి ఈ పని చేస్తున్నట్లు నిందితుల్లో ఒకరు చెప్పినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇందులో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామని, ఇటువంటి వాటిని ఎవరూ ప్రోత్సహించవద్దని, ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవాలని పోలీసులు కోరారు.
#Covid-19# Police# vaccination,