

Hyderabad | హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చీటర్స్‌పై కన్నెర్ర చేశారు. ఎవరైనా ఎటువంటి చీటింగ్ పనులకు పాల్పడిన వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బ్యాంక్ ఖాతాలు సప్లై చేస్తున్న కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ నయీమ్, ఎండీ ఫరూక్ అనే ఇద్దరు నజీరియా నుంచి వచ్చిన వారికి ఇక్కడి బ్యాంక్ అకౌంట్స్ సప్లయ్ చేస్తున్నారు. 10శాతం కమిషన్‌తో అకౌంట్ ఇచ్చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Murder | 5 గంటల్లో రెండు హత్యలు.. మరొకరి కోసం పోలీసులు గాలింపు..
ఇప్పటి వరకు దాదాపు 40 బ్యాంకుల్లో ఖాతాలను వారు ఆఫ్రికన్స్‌కి అమ్మారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
#Police #Nigerians #BankAccounts
1 thought on “Hyderabad | హైదరాబాద్‌లో బ్యాంక్ అకౌంట్ల సప్లయ్.. ఇద్దరు అరెస్ట్..”