Police | బాంబులు పెడతామంటూ స్కూల్‌కు వార్నింగ్.. అలెర్ట్ అయిన పోలీసులు

Police | స్కూల్‌కు వచ్చిన ఈమెయిల్ పోలీసులను సవాల్‌గా మారింది. స్థానికులు ఆందోళన చెందేలా చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా

Spread the love
Police

Police | స్కూల్‌కు వచ్చిన ఈమెయిల్ పోలీసులను సవాల్‌గా మారింది. స్థానికులు ఆందోళన చెందేలా చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇదంతా థానేలో జరుగుతుంది. థానేలోని ఓ స్కూల్‌కు ఇటీవల ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.

అందులో థానేలోని స్కూళ్లు, కాలేజీలు, రైల్వేస్టేషన్లలో బాంబులు పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ మెయిల్‌లో కేవలం మదర్సాలలో మాత్రమే విద్యాబోధన జరగాలని, దేశమంతటా జీహాదీ అనుసరించేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారని పోలీసులు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను పటిష్టం చేశామని, ఎవరైనా సంఘవిద్రోహ చర్యలకు పాల్పడితే విడిచి పెట్టేదే లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇందుకు పాల్పడిన వారు ఎవరైనా పట్టుకునితీరుతామని పోలీసులు తెలిపారు.

#Thane #Police #bomb blast #email

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *