

చిన్ని పిల్లాడు అని కూడా లేకుండా చావబాదాడో టీచర్. పిల్లవాడి శరీరంపై వాతలు తేలి ఉండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించి నిరసనకు దిగారు. వివరాల్లోకివెళితే.. దేచుపాలెం మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో ఇద్దరు చిన్నారులను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎలాంటి కారణం లేకుండా దారుణంగా కొట్టాడు. మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో 4వ తరగతి విద్యార్థి ఉదయభార్గవ్, 1వ తరగతి విద్యార్థిని జెస్సీ.. ఇద్దరూ మాట్లాడుతుండడం ఆయనకు నచ్చేలేదు. దీంతో చేతిలో ఉన్న బెత్తంతో ఇద్దరినీ పాశవికంగా కొట్టాడు. అక్కడే ఉన్న మరో విద్యార్థిని తల్లి దీనిని చూడలేకపోయింది. అదేమని ప్రశ్నిస్తే.. సదరు ప్రధానోపాధ్యాయుడు దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో ఆమె దెబ్బలు తిన్న చిన్నారులకు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహించిన ఆ చిన్నారుల తల్లిదండ్రులు బుధవారం పాఠశాలకు చేరుకున్నారు. ధర్నాకు దిగారు.

ఈ క్రమంలో వాళ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు. దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని, మరుగుదొడ్లను వినియోగించుకోనివ్వటం లేదని, బాత్‌రూమ్‌కు ఇంటికే వెళ్లమని పంపుతున్నారని ఆరోపించారు. యూనిఫాంలు, పుస్తకాలు ఇవ్వట్లేదని ఫిర్యాదు చేసిన పిల్లలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్ పనిచేస్తుందని, ఇద్దరిలో ఎవరో ఒకరే వస్తుంటారని ఆరోపించారు. దీనిపై సమాధానం చెప్పేందుకు ప్రధానోపాధ్యాయుడు నిరాకరించారు. దీనిపై మండల విద్యాశాఖాధికారి నాగరాజును వివరణ కోరితే.. దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
1 thought on “Student beaten | చిన్న పిల్లాడిని చితకబాదిన ప్రిన్సిపాల్”