Shocking | ఆ డ్రస్ అతడిని పట్టించింది.. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

Shocking | ఓ దొంగను పట్టుకోవాలంటే పోలీసులు ఆపసోపాలు పడాలి. అతడేమైనా క్లూ వదిలాడా, అతడి గురించి ఇంకేమైనా తెలుస్తుందా అంటూ అనేక తిప్పలు పడాలి. కానీ ఇటీవల మహరాష్ట్ర పోలీసులు..

Spread the love
Shocking

ఓ దొంగను పట్టుకోవాలంటే పోలీసులు ఆపసోపాలు పడాలి. అతడేమైనా క్లూ వదిలాడా, అతడి గురించి ఇంకేమైనా తెలుస్తుందా అంటూ అనేక తిప్పలు పడాలి. కానీ ఇటీవల మహరాష్ట్ర పోలీసులు మాత్రం ఓ దొంగను పట్టకోవడానికి పెద్దగా శ్రమపడలేదు. అతడి దుస్తులే అతడిని జైలుకి పంపాయి. సాధారణంగా ప్రతి ఒక్కరు తమ పనికి వెళ్లేందుకని, ఇంటిలో ఉన్నప్పటికని కొన్న బట్టలను ఉంచుకుంటారు.

వాటిని అలానే ధరిస్తారు కూడా. కాని మహరాష్ట్ర థానేకు చెందిన 27ఏళ్ల దొంగ దీన్ని మర్చిపోయాడు. అతడు నవంబర్ 27,28 తారీకుల్లో రెండు షాపుల్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ దురద్రుష్టవశాత్తు ఆ ఫాపులు తెరుచుకోకపోవడంతో అతడు ఒట్టి చేతులతోనే తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆ షాపు ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అక్కడి సీసీటీవీ కెమెరా ఫుటేజీలు చూసిన పోలీసులు విషయాన్ని అందరికీ తెలిపారు. దీంతో ఓ ఇన్‌ఫార్మర్ దొంగకు సంబంధించిన వివరాలు తెలపని అడిగాడు. అంతే కొన్ని గంటల్లోనే పోలీసులు దొంగను పట్టుకొని జైల్లో కూర్చోపెట్టారు. దొంగ పేరు మనోజ్ సాహుగా పోలీసుల తెలిపారు.

ఆరోజు కూడా మనోష్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించినప్పటి దుస్తులే వేసుకోవడంతో అతడిని వెంటనే పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. ఆ తరువాత అతడిని కోర్టులో హాజరు పరచడంతో అతడికి శిక్ష పడింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *