

Shocking | ఆత్మహత్యకు పాల్పడిన భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని బుటిబోరిలో శనివారం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యభర్తలిద్దరికి వంట విషయమై వాగ్వాదం జరిగింది. వంట సమయానికి వండలేదంటూ భర్త తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. దాంతో భార్య ఇంటిదగ్గరి బావిలో దూకింది.
ఇది కూడా చదవండి: Crime News | ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో.. ఐదేళ్ల పాప కళ్లముందే దారుణం
భార్యను కాపాడేందుకు భర్త వెంటనే బావిలో దూకాడు. కానీ భార్య పక్కనే ఉన్న ఓ ట్యూబ్‌ను పట్టుకోవడంతో రక్షించబడింది. భర్త మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.
#Husband #Wife #Well #Police
1 thought on “Shocking | భార్యాభర్తల మధ్య గొడవ.. బావిలో దూకిన భర్త”