

Jersey | బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌తో హిట్ అందుకున్న షాహిద్ ఇప్పుడు మరో సినిమాను రిమేక్ చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ‘జెర్సీ’. ఈసినిమానే షాహిద్ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే విధంగా సినిమాను పూర్తి చేశాడు.
ఇప్పటికే ఈ సినిమా కోసం షాహిద్ ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సినిమా మేకింగ్ వీడియోను షాహిద్ షేర్ చేశాడు. జర్నీ ఫర్ ‘జెర్సీ’ అని వీడియోకు ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ఈ వీడియోలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండగా షాహిద్ ఎన్ని సార్లు దెబ్బతిన్నాడో తెలుస్తోంది.
అయితే వీడియో చివరిలో బంతి తగిలి షాహిద్‌కు గాయం అయింది. షర్ట్ నిండా రక్తపు మరకలు కూడా ఉన్నాయి. ఆ గాయంతో దాదాపు 25 కుట్లు పడ్డాయని మూవీ టీమ్ చెప్పింది. ఈ వీడియోను చూసిన అభిమానులంతా షాహిద్ డెడికేషన్‌కు నోరెళ్లబెడుతున్నారు. సినిమా పక్కా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
https://youtu.be/DX3uscCVtjE
#ShahidKapoor #Jersey #Nani