

TET | మహరాష్ట్రలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ పేపర్ లీకు వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాగైనా దోషులను పట్టుకోవాలని కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసులో అనుమానితులందరినీ విచారిస్తున్నారు.
వారిలో మహారాష్ట్ర ఎగ్జామ్ కౌన్సిల్ కమిషనర్ తుకారం సూపె ఒకరు. విచారణలో భాగంగా పోలీసులు తుకారం ఇంటిని సోదా చేశారు. ఈ సోదాలో పోలీసులకు షాక్ తగిలింది.
తుకారాం ఇంటిలో దాదాపు రూ.88 లక్షల నగదు లభ్యమైంది. అంతేకాకుండా బంగారం కూడా దొరికింది. వీటన్నింటితో పాటు తుకారం బంధువుల ఇళ్లలో డబ్బుకట్టలతో నిండిన బ్యాగులు లభ్యమయ్యాయి.
మొత్తంగా తుకారం నుంచి దాదాపు రూ.2 కోట్ల విలువైర నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై డీసీపీ భాగ్యశ్రీ స్పందించారు.. ఈ పేపర్ లీకేజీ వెనక ఎవరెవరు ఉన్నారన్నది త్వరలోనే తెలుసుకుంటామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
#Police #Maharashtra #Commisioner #TeacherElegibilityTest