

Minor | సమాజంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. కామ కోరికలు తీర్చుకునేందుకు తెగబడుతున్నారు. తమ కోరికలకు పసిపిల్లలను బలి చేస్తున్నారు. ఇదే తరహాలో బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది.
తన కామ కోరికలు తీర్చుకునేందుకు ఓ బాలుడు 4 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేశాడు. ఈ ఘటన బీహార్ ముజాఫార్‌పుర్‌లో జరిగింది. ఈ కేసులో 17 ఏళ్ల బాలుడిని, అతడి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చిన్నారికి ఒంటరిగా ఆడుకోవడం గమనించిన బాలుడు చాక్లెట్ ఆశ చూపి ఇంటి నుంచి బయటకి తెచ్చాడు. ఆ తరువాత చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించవద్దంటూ బాలుడి తల్లిదండ్రులు చిన్నారి కుటుంబాన్ని బెదిరించారని పోలీసులు తెలిపారు. బాలుడిపై, అతడి కుటుంబంపై పలు సెక్షన్లలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Police, Rape, minor, Bihar,