

Oke Oka Jeevitham | టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాలో శర్వానంద్‌కు జోడీగా రితువర్మ కనిపించనుంది.
ఈ మూవీలో అక్కినేని అమలా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అయితే న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకోసం సినిమా టీజర్‌ను రెడీ చేశారు. ఈ టీజర్ డిసెంబర్ 29 సాయంత్రం 5గంటలకు రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండా అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్ స్క్రీన్ 1లో టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
దీనికి సంబంధించిన మేకర్స్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాలో ఏదో కొత్తగా చూపించనున్నారని అనిపిస్తోంది. మరి సినిమా ప్రేక్షకులు అనుకున్నంతగా అలరిస్తుందో లేదో వేచి చూడాలి.
https://twitter.com/ImSharwanand/status/1475431807268970496?s=20
#OkeOkaJeevitham #Sarvanand #RituVarma