

Accident | చావు, పుట్టుకలు ఎవరి చేతుల్లో ఉండవు అన్న మాటలను ముంబైలో జరిగిన ఘటన నిజం చేస్తోంది. దాదాపు ఏడాది తర్వాత రోడ్డుపైకి వచ్చిన మహిళ కొద్దిసేపటికే మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన 47 ఏళ్ల మహిళ దాదాపు ఏడాదిగా ఇంట్లోనే ఉంటుంది. జనవరి 18 మంగళవారం నాడు ఆమె పనిమీద తన 23 ఏళ్ల కుమారుడితో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
అదే సమయంలో వెనక నుంచి ఓ బీఎంసీ డంపర్ ట్రక్ ఆమెను ఢీ కొట్టింది. దాంతో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. స్కూటీ నడుపుతున్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Mumbai, woman, accident, Police, dumper truck,