Mob Attack Guntur | నడిరోడ్డుపై రాళ్లు, జాకీలతో దాడి.. అందరూ చూస్తుండగానే..

Mob Attack

Mob Attack: గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ల ప్రాంతంలో ఓ వ్యక్తిపై జరిగిన దాడి వీడియో సంచలనంగా మారింది. కాళ్లు, చేతులు కదలకుండా పట్టుకుని రాళ్లు, జాకీలతో పాశవికంగా కొట్టారు.
ఆ తర్వాత నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. చుట్టుపక్కల వాహనాల వాళ్లు 108 ఆంబులెన్స్‌కి ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చేర్చారు. బాధితుడు పిడుగురాళ్లకు చెందిన సైదా రెడ్డిగా గుర్తించారు.
బాధితుడి కథనం ప్రకారం.. వివాహ వేడుకకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్నానని, హైవే పైకి రాగానే తనను బైక్‌పై వెంబడించారని, అలాగే ముందు కారు అడ్డం పెట్టి నడిరోడ్డుపై నిలువరించి దాడి చేశారని చెప్పుకొచ్చాడు.
ఈ మేరకు సైదారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘శివారెడ్డి, హేమంత్‌రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అన్నపురెడ్డి, నరసరావుపేటకు చెందిన ఇంకొంతమంది నాపై దాడి చేశారు. మేము మా నాన్న టైం నుంచి టీడీపీకి పనిచేస్తున్నాం.
ఈ విషయంలో వాళ్లకి మాకు పాత గొడవలు ఉన్నాయి. వాటికి తోడు పొలంగట్ల దగ్గర కూడా వివాదాలున్నాయి. వాటివల్లే వాళ్లు నాపై దాడి చేశారు. జాకీలు, రాళ్లతో దాడి చేశార’ని సైదా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అంతగా వాళ్లు దాడి చేస్తున్నా.. రోడ్డున అంతా చూస్తూ ఉండిపోయారే కానీ.. ఒక్కరు కూడా కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.