

భార్యతో కలిసి బతకలేనంటూ ఒక వ్యక్తి.. పోలీసుల ముందే గొంతు కోసుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. 30 ఏళ్ల ఓంప్రకాష్ అనే వ్యక్తి వ్యక్తికి భార్యతో గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం పనికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించిన అతని భార్య.. తన భర్తకు మరో యువతితో వివాహేతర సంబంధం ఉందని, ఆమెతోనే ఉంటున్నట్లు తనకు అనుమానంగా ఉందని చెప్పింది.
ఇది కూడా చదవండి: Black Magic | దెయ్యాల పేరుతో మోసం.. అనారోగ్యంతో ఉన్న మహిళని..
దీంతో అతన్ని సంప్రదించిన పోలీసులు.. ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఓంప్రకాష్‌ను ఆదేవించారు. దీంతో స్టేషన్‌కు వచ్చిన అతను.. పోలీసుల ముందే భార్యతో గొడవకు దిగాడు. తనకు ఆమెతో కలిసి ఉండాలని లేదని చెప్తూ.. జేబులో నుంచి బ్లేడు తీసి మణికట్టు, కంఠం కోసుకున్నాడు. దీంతో బిత్తరపోయిన పోలీసులు వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది.