IPhone | ప్రేయసికి గిఫ్ట్ ఇవ్వాలని.. మెడపై కత్తిపెట్టి ఐఫోన్ దొంగతనం

IPhone

IPhone | ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు.. అయ్యో పాపం పసివాడు..’ ఈ పాటకు సరిగ్గా సరిపోతాడు ఆ యువకుడు. ప్రేమ వలలో పడిన ఓ 21 ఏళ్ల యువకుడు తప్పుదారిలో నడిచాడు. ఒక వ్యక్తి మెడపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించాడు.
ఆపై అతని వద్ద ఉన్న ఐఫోన్ దొంగిలించాడు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. కంప్లయింట్ అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు.

దొంగతనం ఎందుకు చేశావని అడిగితే అతను చెప్పిన సమాధానం విని షాకయ్యారు. ఎందుకంటే అతను తన ప్రేయసికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఐఫోన్ ఇవ్వాలనుకున్నాడట.
అందుకే ఈ చోరీ చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. అంతేకాదు, మరికొన్ని రోజుల్లో ప్రేయసితో కలిసి ట్రిప్ వేద్దామని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ ట్రిప్ కోసం కొంత డబ్బు కూడా ఎక్కడో ఒక చోట దొంగిలించడానికి ప్లాన్ వేశాడట.
ఈ విషయాలు తెలియడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
#I-Phone #Love #Robbery #Mobile #Delhi