Safe tourism | ‘సేఫ్ టూరిజం కావాలి’ ప్రభుత్వానికి ఓపెన్ లెటర్


Safe tourism | దేశంలో సేఫ్ టూరిజం కావాలని కోరుతూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాశాడు. పర్యాటక ప్రదేశాల్లో రక్షణ కరువైందని, దాని కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అతడు తన లేఖలో పేర్కొన్నాడు.
ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడితో పాటు పారా గ్లైడింగ్ కోసం వెళ్లాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో తన కుమారుడిని కోల్పోయాడు. దీంతో తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటూ ప్రభుత్వానికి లేఖ రాశాడు.
నాణ్యమైన పరికరాలు, రక్షణ సౌకర్యాలు లేనందునే గతేడాది పారాగ్లైడింగ్ సమయంలో తన 12 ఏళ్ల కుమారుడు మరణించాడని అతడు తెలిపాడు.
అయితే ఇకనైనా పర్యాటక ప్రదేశాల్లో పారాగ్లైడింగ్ వంటి ప్రమాదకర క్రీడలను నిర్వహించే కంపెనీల్లో రక్షణ పెంచాలని, నాణ్యమైన పరికరాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అతడు కోరాడు. వాటన్నింటితో పాటుగా ప్రథమ చికిత్స కిట్, ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని కూడా విన్నవించుకున్నాడు.
మరి ఈ దరఖాస్తు బెంగళూరు ప్రభుత్వం ఏలా స్పందిస్తుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ప్రభుత్వం ఏమని నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
#Tourism #Banglore #ParaGliding #SafeTourism