

ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో లివ్‌ఇన్ పార్టనర్‌ను అత్యంత కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వెలుగు చూసింది. రాజు నీలే (42) అనే వ్యక్తి ముంబైలోని సాకినాక ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతనితో మనీషా జాదవ్ (29) అనే యువతి సహజీవనం చేస్తోంది.
మనీషా మరెవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని రాజు అనుమానించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం నాడు రాజు కోపం హద్దుమీరింది. మనీషాతో వాగ్వాదం పెట్టుకొని, ఆమెపై దాడికి తెగబడ్డాడు. మనీషాకు ఐదేళ్ల కుమార్తె ఉంది.
ఆ చిన్నారి కళ్లెదురుగానే మనీషా తలపై బలంగా కొట్టిన రాజు.. ఆపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. మనీషా ముక్కు, గొంతు, గుండెలు, పొట్ట భాగాల్లో కత్తితో పొడిచిపారేశాడు. ఈ గాయాలతో ఆమె మృతిచెందింది. ఆ వెంటనే అతను ఇంటి నుంచి పారిపోయాడు. అయితే సంఘర్ష్ నగర్ సమీపంలో స్థానికులు అతన్ని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని రాజును అదుపులోకి తీసుకున్నారు.
1 thought on “Crime News | ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో.. ఐదేళ్ల పాప కళ్లముందే దారుణం”