

Mahesh | సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్-త్రివిక్రమ్ కాంబో సినిమా ఇక లేనట్లే అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణను వాయిదా వేసిన మహేష్ సర్జరీ చేయించుకున్నాడు.
దాంతో ఈ సినిమా ఫిబ్రవరి నాటికి పూర్తవుతోంది. ఆ తరవాత ప్రమోషన్స్‌లో మహేష్ బిజీ కానున్నాడు. అంతా ముగిసిన తర్వాత రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని మహేష్ భావిస్తున్నాడట. ‘ఆర్ఆర్ఆర్’ అనంతరం మహేష్‌తో సినిమాపై జక్కన్న కసరత్తు ప్రారంభించనున్నాడని, మహేష్ విశ్రాంతి తర్వాత రాజమౌళి సినిమా ప్రారంభిస్తాడని సినీ వర్గాలు అంటున్నాయి.
దీంతో త్రివిక్రమ్-మహేష్ సినిమా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు లేవని, బహుశా 2023 కి వచ్చే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.
#mahesh# sarkaaru vaari pata# trivikram# rajamouli# RRR