

పంచాదర బొమ్మ కాజల్ అగర్వాల్ త్వరలో స్వీట్ న్యూస్ వినిపించనుందని సోషల్ మీడియా అంతా కోడైకూస్తోంది. అయితే కాజల్ గతేడాది తన స్నేహితుడు, బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. ఈ వార్త అనేక మంది అభిమానులకు బాధపెట్టినా.. కొందరు మాత్రం కాజల్ ఒక ఇంటిది అయినందుకు సంతోషించారు. అయితే ఆ తరువాత అమ్మడు జోరు కాస్త తగ్గించింది
సినిమాలను ఆచితూచి ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకి సాగుతోంది. ప్రస్తుతం కాజల్ ‘ఆచార్య’ సినిమాలో కనిపించనుంది. అయితే కాజల్ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోనుందని, అందుకు కారణంగా అమ్మడు అమ్మ కానుండటమే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని సమర్థిస్తూ అందుకనే కాజల్ ‘ఇండియన్ 2’ సినిమా నుంచి కూడా తప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి కాజల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి త్వరలో ఏమైనా స్వీట్ న్యూస్ చెప్తుందేమో చూడాలి.
దిలా ఉంటే కాజల్ తల్లి కానున్న కారణంగా ‘ఇండియన్ 2’ మేకర్స్ అమ్మడి పాత్రకి మిల్కీ బ్యూటీ తమన్నా తీసుకున్నారట. ఇందు కోసం మేకర్స్ తమన్నా సంప్రదించగా అమ్మడు ఓకే చెప్పిందట. అయిత ప్రస్తుతం తమన్నా మెగా స్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ ‘భోళా శంకర్’లో నటిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం కాజల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే వారి సందేహాలు తీరాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే
,