

ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. పాటల సౌండ్ తగ్గించలేదన్న కారణంతో ఓ వ్యక్తిని చంపేశారు. స్థానికులు ఫిర్యాదు చేయడందో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు సురేంద్ర కుమార్ గున్నార్‌గా పోలీసులు నిర్దారించారు.
అతడు మల్వానీ ఏరియా నివాసిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే సైఫ్ అలి కూడా అక్కడే సురేంద్ర పక్కింట్లో నివసిస్తున్నాడు. సురేంద్ర బుధవారం రాత్రి తన ఇంటి బయట పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టుకున్నాడు. దాంతో సైఫ్ అలీకి డిస్టర్బెన్స్‌గా అనిపించింది. వచ్చి సౌండ్ తగ్గించాలని సురేంద్రను కోరాడు. కానీ సురేంద్ర సౌండ్‌ను తగ్గించేందుక నిరాకరించాడు.
దాంతో సైఫ్‌కు కోపం నశాలానికి తాకింది. అంతే సురేంద్రను గట్టిగా కొట్టి నేలకేసి బాదాడు. దాంతో సురేంద్రం స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే సైఫ్ అలీపై పోలీసులు సెక్షన్ 302 (హత్య) ఇతర సంబంధిత సెక్షలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.