

Ghani | మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన సినిమా ‘గని’. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. అథ్లెటిక్ బాడీ కోసం ప్రతిరోజు గంటల సేపు జిమ్ చేశాడు. ఇంత కష్టపడి ఈ సినిమాను పూర్తిచేస్తే విడుదల మాత్రం ఆలస్యం అవుతోంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కావల్సింది.
కానీ పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో క్లాష్ ఎందుకని మూవీ టీమ్ ‘గని’ రిలీజ్‌ను వాయిదా వేసింది. కానీ ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల విషయంపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ టీమ్ ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాయని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ‘గని’ పవర్‌ఫుల్ పంచెస్‌తో మన ముందుకు రానున్నాడని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.
అంతేకాకుండా సినిమాలోని కొన్ని సీన్లు మరింత అద్భుతంగా వచ్చేలా రీషూట్ జరిగిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
#Ghani #Ghani release #Varun tej,