

మద్యం పంపకాల్లో తేడా రావడంతో ఓ దివ్యాంగుడిని స్నేహితులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ హత్య నవంబర్ 22న సంభవించింది. బాధితుడి కుటుంబీకులు కేసు నమోదు చేయడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు స్నేహితులు కలిసి హర్వంశ్‌నగర్‌కు చెందిన సచిన్ ఉరఫ్ సుదామ(25)మందు పార్టీకి పిలిచారు. దివ్యాంగుడైన సుదామ స్నేహితులు పిలవడంతో వారి వెంట వెళ్ళాడు. ఆ తరువాత మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు.
దాంతో సుదామ కుటుంబ సభ్యులు ముగ్గురు స్నేహితులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ముగ్గురు స్నేహితులను విచారించగా వారు తమ తప్పుని ఒప్పుకున్నారు. మందు పంపకాల్లో తేడా రావడంతోనే సుదామను హత్య చేశామని తెలిపారు. అయితే మొదట స్క్రూడ్రైవర్‌లో మెడపై పొడిచి జాకెట్ తాడును మెడకు బిగించారు. దాంతో సుదామ మరణించాడు. అనంతరం ముగ్గురు స్నేహితులు కలిసి సుదామ దేహాన్న దహనం చేశారు.
వారు చెప్పిన విధంగానే ఘటనా స్థలంలో ఎముకలు, మందు బాటిళ్ళు, గ్లాసులు లభ్యమయ్యాయని సిటీ ఎస్పీ నిఫుణ్ తెలిపారు. అంతేకాకుండా ఆ ఎముకలను డీఎన్ఏ టెస్ట్ పంపామని చెప్పారు. హత్య జరగడానికి కేవలం మందు పంపకాలే కారణమా, లేకుంటే మరేమైనా ఉన్నాయా, పాత కక్షలే కారణమా అన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
1 thought on “Murder | దారుణానికి దారి తీసిన మద్యం.. పంపకాల్లో అవకతవక..”