

Father Raped Daughter | మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. తన మైనర్‌కూతురిని తల్లిని చేశాడో తండ్రి. తీరా కూతురు గర్భవతి కావడంతో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసేశాడు.
తీరా విషయం తెలియడంతో అల్లుడు కూతురిని పుట్టింటి దగ్గర వదిలేశాడు. ఇటీవల ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. అక్కడ పోలీసులకు విషయం తెలియడంతో కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు విషయం తెలియడంతో బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాలిక తల్లి చనిపోయిన తర్వాత ఆ తండ్రి తన 15 ఏళ్ల కూతురిపై కన్నేశాడు. అప్పటి నుంచి తన కూతురుపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. ఇలా కొన్నాళ్లుగా చేస్తూనే వచ్చాడు. దాంతో బాలిక గర్భం దాల్చింది.
విషయం తెలిసిన నిందితుడు విషయాన్ని కప్పిపుచ్చేందుకు అమ్మాయికి పెళ్లి చేశాడు. అత్తారింటికి వెళ్లిన కొన్ని రోజులకే బాధితురాలి భర్తకు బాలిక గర్భం గురించి తెలిసింది. బాలికను పుట్టింటి దగ్గర వదిలి వెళ్లిపోయాడు.
బాధితురాలు కొన్ని రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చిందని పోలీసులు తెలిపారు. బాలిక తండ్రిని అరెస్ట్ చేశామని, ఇంకా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
#Father #MinorGirl #Raped #Maharashtra #Police