

Twitter | ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌కు భారీ షాక్. బ్యాన్ చేసిన కంటెంట్ తొలగించలేదనే కారణంతో ఈ కంపెనీకి రూ.30 లక్షల ఫైన్ వేయడం జరిగింది. అయితే ఇది మనదేశంలో కాదు. రష్యాలో. ఇటీవల దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీదా రష్యా ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌కు రూ.30లక్షల జరిమానా విధిస్తూ రష్యాలోని ఒక కోర్టు తీర్పు వెలువరించింది. రష్యా ప్రభుత్వం నిషేధించిన కంటెంట్‌ను ట్విట్టర్ తొలగించకపోవడం వల్లనే ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అలాగే, మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వెబ్‌సైట్ గిట్‌హబ్ (GitHub)కు కూడా ఇదే కారణంగా చూపిన సదరు కోర్టు రూ.10 లక్షలు జరిమానా విధించింది.
ఈ ఏడాది మార్చి నుంచి ఛైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్ అబ్యూజ్ వివరాలు వంటి పోస్టులు ఉన్నాయంటూ ట్విట్టర్‌కు రష్యా ప్రభుత్వం హెచ్చరికలు చేస్తూ వచ్చింది. దీన్ని నియంత్రించడం కోసం ట్విట్టర్ వేగాన్ని తమ దేశంలో తగ్గించింది కూడా. ఇప్పుడు తాజాగా రూ.30 లక్షల ఫైన్ విధించింది.