

Trekking | సాహసం చేయడంలో యువత ముందంజలో ఉంటుంది. సాహసం చేయాలన్న ఉత్సుకతతో చాలా మంది యువకులు ట్రెక్కింగ్ చేస్తుంటారు. అదేవిధంగా ట్రెక్కింగ్ చేసేందుకు హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన నలుగురు యువకులు శనివారం రాత్రి అదృశ్యమయ్యారు.
పర్వతాధిరోహణ చేస్తున్న సమయంలో వారు కనిపించకుండా పోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా ప్రాంతంలోని ట్రెక్కింగ్ స్పాట్‌లో చోటుచేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపులు ప్రారంభించారు.
అయితే ఆదివారం పోలీసులకు ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో కనిపించారు. అనంతరం పోలీసులు వారిని రక్షించారు.
జారి పడిపోవడం కారణంగానే వారికి గాయాలు అయ్యాయని, మరో ఇద్దరు మృతి చెందారని కాంగ్రా ఏఎస్‌పీ తెలిపారు. రక్షింపబడిన యువకుల ఆరోగ్యం బాగానే ఉందని, వారికి ఇంకా వైద్య సేవలు అవసరం ఉన్నాయని పోలీసులు తెలిపారు.
#trekking #Police #teenage boys #Himachal pradesh