Crime | దారుణం.. ఆ దారం అమ్మారని ఇళ్లు కూల్చేశారు

Crime | సంక్రాంతి వచ్చిందంటే దేశ వ్యాప్తంగా గాలిపటాల వారికి గిరాకీ పెరుగుతోంది. పిల్లలు పెద్దలు గాలిపటాలు ఎగురవేసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ

Spread the love
Crime

Crime | సంక్రాంతి వచ్చిందంటే దేశ వ్యాప్తంగా గాలిపటాల వారికి గిరాకీ పెరుగుతోంది. పిల్లలు పెద్దలు గాలిపటాలు ఎగురవేసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ వారు గాలిపటం ఎగరేసేందుకు వాడే చైసీస్ మాంజా దారం ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది.

అయితే మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ ఈ మాంజా దారం కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మాంజా దారం క్రయవిక్రయాలను నిషేధించింది. కానీ ఇటీవల కొందరు ఈ దారాన్ని అమ్మడంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంది.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు మాంజా దారం విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు చేసి, వారి ఇళ్లను కూల్చివేశారు. అయితే రాష్ట్రంలో మాంజా దారం విక్రయాలను ఆపేందుకే ఈ కూల్చివేతను చేపట్టామని ఉజ్జయిని డీఎం తెలిపారు.
#Police #MP #CM #Manja thread

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *