

Murder | బెంగళూర్‌లో దారుణం చోటుచేసుకుంది. డబ్బుకోసం స్నేహితులే ఓ 19 ఏళ్ల యువకుడి ప్రాణం తీశారు. స్నేహితుల మధ్య రూ.1200 కోసం మొదలైన తగువ ఒకరి ప్రాణాన్ని తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో కొందరు స్నేహితులు కలుసుకున్నారు.
వారిలో ఒకరు రూ.1200 ఇవ్వాల్సి ఉందని, అవి ఇంకా ఇవ్వలేదని స్నేహితుల్లో గొడవ వచ్చింది. అది కాస్తా పెద్దది కావడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఆ తరువాత కొంతసేపటికే గొడవ మళ్లీ రాజుకుంది. దాంతో వారిలో ఒకరు ఆగ్రహంతో బాధితుడిని పొడిచి హత్య చేశాడు.
ఇది కూడా చదవండి: Goa | సక్సెస్ అయిన గోవా హ్యాపీ న్యూ ఇయర్ మిషన్.. 22 మందిని పట్టుకున్న పోలీసులు
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి మధ్య గొడవకి డబ్బులే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు రెండో సారి మళ్లీ గొడవ వచ్చింది? అని పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
#Bengaluru #Police #Stabbed
1 thought on “Murder | డబ్బు పెట్టిన గొడవ.. ప్రాణం తీసిన స్నేహితుడు”