

Jallikattu | తమిళనాడులో జల్లికట్టు ఆటకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందులో పాల్గొనేందుకు పురుషులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఈ ఆటను ప్రతి ఏటా సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహిస్తారు.
అదే విధంగా ఈ ఏడాది కూడా ఈ ఆటను ఘనంగా నిర్వహించారు. కానీ ఈ ఏడాది తమిళనాడు మధురైలోని అవనియపురంలోని జల్లికట్టు ఆటలో దారుణం జరిగింది. ఆటలో భాగంగా దాదాపు 300 ఎద్దులతో ఈ ఏడాది జల్లికట్టు ఆటను ప్రారంభించారు.
ఆట మొదలైన కొద్ద సేపటికే ఎద్దులు రెచ్చిపోయాయి. వాటి తాకిడికి తట్టుకోలేక ఆటగాళ్లు, వీక్షకులు అందరూ ఎటుపడితే అటు పరుగులు తీశారు. ఈ క్రమంలో 18 ఏళ్ల ఓ యువకుడు మృతి చెందాడు.
అంతేకాకుండా దాదాపు 80 మంది గాయాల పాలయ్యారు. వైద్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 ఏళ్ల యువకుడు ఛాతీపై ఎద్దులు తొక్కడంతో మరణించాడని తెలిపారు.
ఇక గాయాలపాలయిన వారి విషయానికొస్తే వారిలో 38 మంది ఎద్దును చూసుకునేవారు, ఎద్దు యజమానులు 24 మంది, 18 మంది వీక్షకులు ఉన్నారని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఎద్దులన్నీ అదుపులో ఉన్నాయని తెలిపారు.
#jallikattu #thamil Nadu #bulls,