

New Year | జమ్ముకాశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో ఘోరం చోటుచేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని సందర్శించుకుందామని వచ్చిన వారిలో దాదాపు 12 మరణించారు. ఆలయంలోనే తమ తుది శ్వాస విడిచారు.
అంతేకాకుండా దాదాపు 20 మంది గాయాలపాలయ్యారు. ఆలయంలో రాత్రి 2:45 నిమిషాల సమయంలో సంభవించిన తోపులాట కారణంగానే ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.
డీజీపీ దిల్‌బగ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా వందల సంఖ్యలో ప్రజలు ఆలయానికి వస్తుంటారు. రాత్రి కూడా అదే తరహాలో వచ్చారు. అదే సమయంలో కొందరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
అది కాస్త పెద్దది కావడంతో తోపులాటగా మారింది. అది తొక్కిసలాటగా అవతరించి దాదాపు 12 మంది ప్రాణాలు హరించిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎన్‌క్వైరీ వేశారని తెలిపారు.
#Police #New Year #JammuKashmir # MataVishnodaviTemple