

దివాళీ అంటేనే అందరిలో తెలీని ఉత్యాహం ఉరకలేస్తుంటుంది. ఇక పిల్లల విషయానికి వస్తే వారిని పండగకు వారం ముందు నుంచి పండగ అయిన వారం వరకు ఉత్సాహం ఉంటుంది. ఈ పండగ సమయంలో బాంబులో పేల్చడం కోసం చిన్నారులు ఎప్పుడెప్పుడు రాత్రవుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఆ రోజు ప్రతి ఒక్కరూ తమకు తగిన స్థాయిలో బాంబులు తెచ్చుకొని కాలుస్తారు. ఆ సమయంలో చిన్నపిల్లలు బాంబులను వివిధ ప్రదేశాల్లో పెట్టి పేల్చడం సహజం. అలాంటి ఆలోచనే ఓ పిల్లాడి ప్రాణం తీసింది.
అందరిలానే లక్ష్య యాదవ్ (11) కూడా తన బాంబులు ఎంతో ఆనందంగా కాలుస్తున్నాడు. అప్పుడే ఓ బాంబును ఓ స్టీల్ గ్లాసులో పెట్టి పేల్చాడు. బాంబు పెద్ద శబ్దంతో పేలింది. ఆ బాంబు దెబ్బకి స్టీల్ గ్లాసు కూడా పగిలి ముక్కలైపోయింది. వాటిలో ఓ ముక్క లక్ష్య ఛాతీలో గుచ్చుకుంది. లక్ష్య అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ దారి మధ్యమంలోనే లక్ష్య ప్రాణాలు విడిచాడని వైద్యులు తెలిపారు. చాతీలోకి ఇసుప ముక్క దిగిన కారణంగా రక్తస్రావం విపరీతంగా అయిందని, దాని కారణంగానే కుర్రాడు మరణించాడని తెలిపారు.