కానిస్టేబుల్ Suicide.. కారణం అదే..


‘పుట్టిన జీవి గిట్టక తప్పదు’ అని గీతలో కృష్ణుడు చెప్పాడు. అలాగే మరణం వచ్చేది ఎలా అయినా వస్తుంది. మనచేతుల్లో ఏముంది అని పెద్దలు అంటుంటారు. కానీ కొందరు మాత్రం తమకున్న సమస్యలకు భయపడో, దారితోచకో Suicide చేసుకుని అర్థాంతరంగా చనిపోతున్నారు. అయితే పెద్దలు చేప్పే మాటను చెన్నైలోని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య కేసు నిజం చేస్తుంది. అతడు ఆత్మహత్యకు ప్రయత్నించినా మరణించిన కారణాలు వేరు. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా అన్నానగర్ పోలీస్టేషన్‌లో వేదమాణిక్యం(34) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
అతడు సోమవారం డ్యూటి అయిన తరువాత మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దాంతో అతడి భార్యకి, అతడికి మధ్య చిన్న గొడవ జరిగింది. అనంతరం మాణిక్యం తన గడిలోకి వెళ్లి ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ తాడు తెగిపోవడంతో కిందపడిపోయాడు. అదే సమయంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఆ శబ్దానికి అతడి భార్య పరుగులు పెడుతూ వచ్చి చూసింది. తన భర్త నేలపై పడిఉండటంతో స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే మాణిక్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయంపై తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.