Acharya | సిద్ధ వచ్చేశాడు.. మెగా ఫ్యాన్స్ పండగే..


మెగా ఫ్యాన్స్‌కి పూనకాలు షూరూ అయిపోయాయి. వారెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిద్ధ సాగా టీజర్ వచ్చేసింది. టీజర్ చూసిన వారంతా ఆచార్య అదిరిపోనుందని భావిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, చిరు టీజర్, గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు చెర్రీ నటిస్తున్న సిద్ద పాత్ర టీజర్ కూడా వచ్చేయడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిద్ద టీజర్ ట్రెండ్ అవుతోంది. ఇక టీజర్ విషయానికొస్తే.. ఈ టీజర్‌లో చెర్రీ రొమాంటిక్ సైడ్‌తో పాటు మాస్ సైడ్ కూడా చూపించారు. సినిమా చెర్రీ యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోనున్నాయని అర్థం అవుతోంది. అయితే ఈ టీజర్‌లో చెర్రీ, చిరుని చిరుత పులులతో పోలుస్తూ పెట్టిన సీన్ మాత్రం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఒక కొలునులో చిరుత పులి పిల్ల నీళ్లు తాగుతుంటే తల్లి పక్కనే అటూఇటూ తిరుగుతుంది. అదే కొలనుకి మరోవైపు రామ్ చరణ్ నీళ్లు తాగుతుంటే చిరంజీవి తిరుగుతూ ఉన్నాడు. ఈ సీన్‌తో చెర్రీ, చిరు చిరతల్లాంటి వారని కొరటాల సింబాలిక్‌గా తెలిపడం చాలా బాగుంది.
ఇది కూడా చదవండి: Nithya menen | లేడీ పవన్ కళ్యాణ్.. షూటింగ్‌లో త్రివిక్రమ్ అలానే పిలిచేవారు
‘ధర్మస్థలికి ఆపదొస్తే అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మా ఆవహించి ముందుకు పంపుద్ది’ అన్న పవర్ ఫుల్ డైలాగ్‌తో చరణ్ యాక్షన్ సీన్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా టీజర్ ప్రారంభంలో చాలా ప్రశాంతంగా ఉండే కుర్రోడి పాత్రలో కనిపించిన చెర్రీ టీజర్ ఆఖరికి మాత్రం పూర్తి డిఫరెంట్‌గా కనిపించాడు. దీంతో ఈ సినిమాలో చెర్రీని డబుల్ షేడ్స్‌లో చూడనున్నామని అర్థం అవుతోంది. టీజర్‌తోనే అభిమానుల మనసులు గెలుచుకున్న చెర్రీ సినిమాతో ఇంకెంత క్రేజ్ అందుకుంటాడో వేచి చూడాలి.
1 thought on “Acharya | సిద్ధ వచ్చేశాడు.. మెగా ఫ్యాన్స్ పండగే..”