


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఏం చేసినా అది హాట్ టాపిక్ అవుతోంది. సామ్ విడాకులు అయినప్పటి నుంచి అందరి దృష్టి అమ్మడిపైనే ఉంది. అయినా అవేంపట్టించుకోకుండా సమంత తన లైఫ్‌లో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో సమంత తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్న విషయం తెలిసిందే.
ఈ విషయం తెలిసినప్పటి నుంచే సమంత స్పెషల్ సాంగ్ అంటే ఇక ఊరమాస్ అంటూ అభిమానులు ఊహాగానాలు చేశారు. అయితే ఈ పాట తాజాగా వీడుదలైంది. ఈ పాటలో ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అంటూ సామ్ ఊరిస్తోంది. సామ్ అందాలకు తోడు దేవీ శ్రీ ప్రసాద్ తనదైన మ్యూజిక్‌తో పాటకు ఊపందించాడు.
ఇది కూడా చదవండి: Prabhas | ప్రభాస్ పెళ్లికి సిద్దం.. రూ.200 కోట్లతో..??
ఈ పాట ఊరమాస్ బీట్‌కు సామ్ ఊరమాస్ స్టెప్పులు బిగ్ స్కీన్‌పైనే చూడాలంటూ అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. మరి వారి ఊహలకు తగ్గట్టుగా సినిమా ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
1 thought on “Samantha | ‘ఊ అంటారా’ అంటూ ఊరిస్తున్న సామ్.. పుష్ప సాంగ్ అదుర్స్..”