

బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రన్‌వీర్ సింగ్ సినిమాల విషయంలో రాజీ పడడన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రన్‌వీర్ 1983 క్రికెట్ ప్రపంచ కప్ నేపథ్యంలో ‘83’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రన్‌వీర్ సింగ్ భారత క్రికెటర్, అప్పటి సారధి కపిల్ దేవ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో అప్పటి ప్రపంచకప్ సమయంలో భారత్ ఎదుర్కొన్న సమస్యలను, అవమానాలను కళ్లకు కట్టినట్లు చూపించనట్లు మేకర్స్ తెలిపారు. ఈ టీజర్ సంచలనాలు సృష్టించింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలయ్యి అందరినీ దృష్టి ఆకర్షిచింది.
ఇది కూడా చదవండి: Sirivennela Seetharama Sastry | ఆగిన కలం.. ‘సిరివెన్నెల’ కన్నుమూత
ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఒకటే.. బొమ్మ అదిరింది. 1983 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్.. మంగళవారం నాడు విడుదలైంది. ఇది చూసిన వారంతా హీరో రణ్‌వీర్ సింగ్ నటన, కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చూసి నోరెళ్లబడెతున్నారు. ‘నిజంగా ఈ ట్రైలర్ చూసి గూస్‌బంప్స్ వస్తున్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి చూసేయండి.
1 thought on “83 Trailer | ’83’ ట్రైలర్ అదిరిపోయిందిగా..!”