

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా సినిమా రాధేశ్యామ్ సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ పాట ‘ఆషికి ఆగయీ’ వచ్చేసింది. ఈ పాటలో ప్రభాస్‌ను చాలా రొమాంటిక్‌గా చూపించారు. దాంతో పాటుగా పూజా హెగ్దె, ప్రభాస్ మధ్య లవ్‌ట్రాక్ కూడా చాలా బాగా చూపారు. ఈ పాట ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా’ అన్న ప్రశ్నతో మొదలయింది. ఇక పాటలో చూపిన లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ప్రభాస్, పూజా మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా చూపించారు.
ఈ పాట చూస్తుంటే ఏది ఏమైనా ఈ సినిమాలో పాటలు బంపర్ హిట్ కావడం పక్కా అని అభిమానులు అంటున్నారు. అదే సమయంలో వీడియో చివరిలో చూపిన విజువల్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రభాస్ రక్తంతో కనిపించడం, చివరిలో ఒంటరిగా ఉండిపోవడం చూసిన అభిమానులకు సినిమాపై ఉత్సుకత మరింత అధికం అవుతోంది.