


Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ప్రస్తుతం సినిమా ట్రైలర్ కోసం అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. దీంతో వారికి ఊరటనిచ్చే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 6న అందరూ ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వారు ప్రకటించారు. చెప్పినట్లుగానే కాస్త లేట్ అయినా లేటెస్ట్‌గా వచ్చాడు పుష్పరాజ్. సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి అద్భుతంగా చూపించినట్లు అర్థం అవుతోంది.
అయితే ఇవాళ సాయంత్రం 6 గంటలకు మోస్ట్ ఎవెయిటెడ్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ నెవ్వర్ బిఫోర్ అనేలా అందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్‌లో బన్నీని చూపకపోయినా అందరినీ కట్టిపడేశారు. ఈ ట్రైలర్‌లోనే యాక్షన్ సీన్‌లతో పాటు సస్పెన్స్‌ను కూడా అద్భుతంగా చూపించారు. ఇందులో అల్లు అర్జున్ కోసం పోలీసులు ఎంతగానో వెతుకుతుంటారు.
ఈ సీన్‌లతో అల్లుఅర్జున్ ఎంత పెద్ద స్మగ్లర్ అన్న విషయాన్ని చూపించారు. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్‌ను చూపించీ చూపించనట్లు అభిమానుల్లో ఎక్కడలేని ఉత్కంఠను రేకెత్తించారు. ఇందులో బన్నీ ఏ స్థాయి స్మగ్లింగ్ చేయనున్నాడు? అసలు బన్నీది నెగిటివ్ పాత్ర? పాజిటివ్ పాత్ర? డబుల్ రోల్‌లో కనిపిస్తాడా?.. ఇలా అనేక ప్రశ్నలు ప్రేక్షకుల మదుల్లో మెదులుతున్నాయి. అయితే వాటన్నింటికీ సమాధానం దొరకాలంటే డిసెంబర్ 17న థియేటర్లకు వెళ్లాల్సిందే.
#Pushpa #allu arjun #Pushpa Trailer #sukumar #Rashmika