
Lakshya

Lakshya | టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య సరైన హిట్ కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాడు. దానికోసం టాలీవుడ్ ఇప్పటివరకు టేస్ట్ చేయని ఓ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఫుల్ ఫిట్‌గా… కండలు తిరిగిన దేహంతో ఓ కొత్త నాగశౌర్యని పరిచయం చేబోతున్నాడు.
‘లక్ష్య’ టైటిల్‌తో ఈ సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. ఈ సినిమా కోసం నాగశౌర్య తెగ కష్టపడుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా కోసం సిక్స్‌ప్యాక్ బాడీతో అదరగొడుతున్నాడు.
పక్కా అథ్లెటిక్ బాడీ పెంచాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే ఈ రోజు బుధవారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది.
ఈ ట్రైలర్‌ను కూడా ఊహలకు తగ్గట్టుగానే అందరినీ మెప్పించింది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు బొమ్మ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రైలర్ ఆర్చరీ రూల్స్ చెబుతూ ప్రారంభం అయింది.
అయితే ఈ ట్రైలర్‌ను లవ్ ట్రాక్, యాక్షన్ ఇల్లా అన్ని ఎలిమెంట్స్‌ని కలగలపి రెడీ చేశారు. ట్రైలర్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీరు మిస్సయి ఉంటే ఓ లుక్కేసెయ్యండి..
#Naga #Sourya #Lakshya #Lakshya #Trailer