

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది. తన సోగసులతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తాజాగా వర్షంలో హాట్ డాన్స్ చేసి అందరినీ మంత్రముగ్దులను చేసేసింది. అయితే కత్రినా తాజాగా నటిస్తున్న సినిమా ‘సూర్యవంశీ’. ఈ సినిమాలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌కు జంటగా అమ్మడు నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నాజా’ పాట విడుదలైంది. ఆ పాటలోనే బ్లాక్ డ్రెస్‌తో కత్రినా అందరినీ ఆకట్టకుంది.
తాజాగా మరో పాటతో అభిమానులను పిచ్చోళ్లను చేసింది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాటలో ముందగా కత్రినా తనదైనా పాప్ డాన్స్‌తో అదరగొట్టేసింది. ఆ తరువాత అక్షయ్ కూడా రంగంలోకి దిగి తనదైన డాన్స్‌తో మెప్పించాడు. ఈ సినిమా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా వారి అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.