ఇందిరా గాంధీ వారిని చెప్పుకింద దోమల్లా తొక్కేసింది: కంగనా


Indiragandhi crushed Khalistanis | బాలీవుడ్ బ్యూటీ కంగనా తనదైన మాటలతో ఎప్పుడూ వార్తల్తో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై సంచలన కామెంట్స్ చేసి అమ్మడూ మల్లీ స్పాట్‌లైట్‌లోకి వచ్చింది.
ఆమె పేరు చెబితే ఖలిస్థానీలకు ఇప్పటికీ దడ అంటూ కంగనా చేసిన ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే కంగనా తన ట్వీట్‌లో ఇందిరా గాంధీ పేరు వాడలేదు. కానీ భారత మహిళ ప్రధానీ అంటూ రాసుకొచ్చింది. ఆమె దేశాన్ని ఎన్ని ఇబ్బందులకు పెట్టినప్పటికీ ఖలిస్థానీల విషయంలో తన ప్రాణాలను పణంగా పెట్టారని కంగానా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
‘ప్రస్తుతం ఖలిస్థానీలు బలపడి, ప్రభుత్వాన్ని వక్రీకరిస్తుండొచ్చు. కానీ ఒకప్పుడు భారత ఏకైక మహిళా ప్రధాని వారిని చెప్పుకింద దోమల్లా చిదిమేశారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిపై చర్యలు చేపట్టారు. ఆమెను మనం ఎన్నటికీ మరిచిపోకూడదు’ అని కంగనా తన స్టోరీలో రాసింది.
దాంతో పాటుగా ఖలిస్థానీల భరతం పడుతూనే వారి కారణంగా దేశం ముక్కలు కాకుండా ఆపారని, ఆమె మరణించి దశాబ్దాల అవుతున్నప్పటికీ ఖలిస్థానీలు ఆమె పేరు వింటేనే వణుకుతారని కంగనా రాసింది.